Hyderabad: పాత‌బస్తీలో లూడో గేమ్ ఆడుతూ కొట్టుకున్న‌ ఇద్ద‌రు యువ‌కులు.. ఒక‌రి మృతి.. మ‌రొక‌రి పరిస్థితి విష‌మం

man kills in old city

  • మంగ‌ళ్‌హాట్ గుప్ఫాన‌గ‌ర్‌లో ఘ‌ట‌న‌
  • ఈ రోజు తెల్ల‌వారుజామున‌ లూడో గేమ్ ఆడిన ఇద్ద‌రు యువ‌కులు
  • డ‌బ్బు విష‌య‌మై గొడ‌వ  

లూడో గేమ్ హైద‌రాబాద్‌లో ఓ యువ‌కుడి ప్రాణాలు తీసింది. మ‌రొక యువ‌కుడు ఆసుప‌త్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య పోరాడుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు సేక‌రించారు. హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీలోని మంగ‌ళ్‌హాట్ గుప్ఫాన‌గ‌ర్‌లో ఈ రోజు తెల్ల‌వారుజామున‌ లూడో గేమ్ ఆడిన ఇద్ద‌రు యువ‌కులు హ‌నీఫ్‌, హాజీ డ‌బ్బు విష‌య‌మై గొడ‌వ ప‌డ్డారు.

ప‌ర‌స్ప‌రం దాడి చేసుకోవ‌డంతో హ‌నీఫ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. హాజీకి కూడా తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఉస్మానియా ఆసుప‌త్రిలో అత‌డికి చికిత్స అందుతోంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.


  • Error fetching data: Network response was not ok

More Telugu News