Jithender Reddy: తెలంగాణ ప్రభుత్వం ఈసీకి తప్పుడు నివేదిక పంపింది: బీజేపీ నేత జితేందర్ రెడ్డి

Jitender Reddy slams Telangana govt
  • పండగల సీజన్ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఓడిపోతుందన్న జితేందర్ రెడ్డి
  • అందుకే వాయిదా వేయించారని ఆరోపణ
తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికలను పండగల సీజన్ తర్వాతనే నిర్వహించాలని ఎన్నికల సంఘం తాజా నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. కరోనా పరిస్థితులు, పండుగల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని ఉప ఎన్నికలను కొంతకాలం తర్వాత నిర్వహించాలని ఇరు రాష్ట్రాల సీఎస్ లు కోరినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

దీనిపై తెలంగాణ బీజేపీ నేత జితేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈసీకి తప్పుడు నివేదిక పంపిందని ఆరోపించారు. హుజూరాబాద్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు నిఘా వర్గాల నుంచి నివేదిక అందిందని అన్నారు. తప్పుడు నివేదికల ద్వారా తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేయించిందని మండిపడ్డారు.
Jithender Reddy
Huzurabad
By Election
EC
TRS
BJP
Telangana

More Telugu News