KCR: అమిత్ షాతో భేటీ అయిన కేసీఆర్

KCR meets Amit Shah
  • ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్
  • ఐపీఎస్ కేడర్ రివ్యూపై అమిత్ షాతో చర్చించనున్న కేసీఆర్
  • నిన్న మోదీతో భేటీ అయిన సీఎం
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐపీఎస్ కేడర్ రివ్యూ, విభజన చట్టం హామీలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంపై కూడా కేసీఆర్ చర్చించనున్నారు.

మరోవైపు, నిన్న సాయంత్రం ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరి సమావేశం దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. వివిధ అంశాలకు చెందిన 10 లేఖలను మోదీకి కేసీఆర్ అందజేశారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.
KCR
TRS
Amit Shah
BJP
Narendra Modi

More Telugu News