Harish Rawat: మాట నిలబెట్టుకున్న ఉత్తరాఖండ్ మాజీ సీఎం.. భక్తుల బూట్లు తుడిచి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం!

  • నవజోత్ సింగ్ సిద్ధూ, ఇతరులను సిక్కుల పవిత్ర పదంతో పోల్చిన హరీశ్ రావత్
  • చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని ప్రకటన
  • అన్నట్టే గురుద్వారాలో కరసేవ
Harish Rawat Wipes Shoes At Gurdwara To Atone For Panj Pyare

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీశ్ రావత్ పాప ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఓ గురుద్వారాలో భక్తుల బూట్లు తుడవడం, ప్రార్థనా మందిరాన్ని చీపురుతో శుభ్రపరచడం ద్వారా గతంలో తాను చేసిన వ్యాఖ్యల పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు.

గతవారం పంజాబ్‌లోని చండీగఢ్‌లో పర్యటించిన హరీశ్ రావత్ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సహా ఐదుగురు నేతలను ఉద్దేశించి సిక్కుల పవిత్ర పదంతో పోల్చారు. ఈ పదం ఉపయోగించిన హరీశ్ రావత్ సిక్కుల మనోభావాలను దెబ్బతీశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో వెంటనే తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన రావత్ క్షమాపణ చెప్పారు. అంతేకాక, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా గురుద్వారాలో కరసేవ చేస్తానని ప్రకటించారు. చెప్పినట్టుగానే నిన్న ఉత్తరాఖండ్‌, ఉదంసింగ్ నగర్‌లోని నానక్‌మిట్టలో ఉన్న గురుద్వారాను సందర్శించి భక్తుల బూట్లు తుడిచి, మందిర పరిసరాలను చీపురుతో శుభ్రం చేశారు.

More Telugu News