'మా' ఎన్నికల్లో తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన ప్రకాశ్ రాజ్
- రసవత్తరంగా మా ఎన్నికలు
- మీడియాకు వివరాలు తెలిపిన ప్రకాశ్ రాజ్
- ఉపాధ్యక్షులుగా హేమ, బెనర్జీ
- ట్రెజరర్ గా నాగినీడు
- జయసుధకు దక్కని స్థానం
- ఆమె అమెరికా వెళ్లిందన్న ప్రకాశ్ రాజ్
సీనియర్ నటి జయసుధ అమెరికా వెళ్లడం వల్ల ఆమెకు ప్యానెల్లో చోటు కల్పించలేదని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. అయితే ప్యానెల్ కు తన మద్దతు ఉంటుందని జయసుధ హామీ ఇచ్చారని వివరించారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో ప్రగతి, అనసూయ, అజయ్, సుబ్బరాజు, సమీర్, ఖయ్యూం, బ్రహ్మాజీ, కౌశిక్, ప్రభాకర్, భూపాల్, శివారెడ్డి, రమణారెడ్డి, సుడిగాలి సుధీర్, సురేశ్ కొండేటి, తనీష్, టార్జాన్ సభ్యులుగా ఉన్నారు.