Telangana: కాలేజీల గుర్తింపు ప్రక్రియ ఆలస్యం.. ఎంసెట్​ షెడ్యూల్​ పై ఎఫెక్ట్​!

TS EAMCET Web Options Process Postponed
  • వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసిన అధికారులు
  • 11వ తేదీ నుంచి 16 వరకు అవకాశం
  • యథాతథంగా సర్టిఫికెట్ల పరిశీలన

తెలంగాణ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్ లో ఉన్నత విద్యామండలి అధికారులు మార్పులు చేశారు.

మొదట ఈ నెల 4వ తేదీ నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినా.. ఇప్పుడు దానిని 11వ తేదీకి వాయిదా వేశారు. 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. 18న ఇంజనీరింగ్ తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన తేదీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. 4వ తేదీ నుంచి 11 వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.

  • Loading...

More Telugu News