hari krishna: హ‌రికృష్ణ జ‌యంతి వేళ‌ ప్ర‌ముఖుల నివాళులు

chnadrababu pays tribute to  harikrishna on his  birth anniversary
  • అందరికీ ఆత్మీయుడిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు: చంద్ర‌బాబు
  • హరి మావయ్యకు ఘన నివాళులు: లోకేశ్‌
  • ఈ అస్థిత్వం మీరు.. ఈ వ్య‌క్తిత్వం మీరు: క‌ల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్
సినీన‌టుడు దివంగ‌త హ‌రికృష్ణ 65వ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను గుర్తు చేసుకుంటూ ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.

'నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. అందరికీ ఆత్మీయుడిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన హరికృష్ణ జ్ఞాపకాలను, పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవను ఈ సందర్భంగా స్మరించుకుందాం' అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

'కొందరు మన మధ్య లేకపోయినా వారితో మనకు ఉన్న అనుబంధం వారిని సజీవంగా మన కళ్ల‌ ముందు ఉంచుతుంది. నా విషయంలో హరి మావయ్య కూడా అంతే. ఆయన జయంతి సందర్భంగా హరి మావయ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను' అని టీడీపీ నేత‌ నారా లోకేశ్ పేర్కొన్నారు.

'ఈ అస్థిత్వం మీరు.. ఈ వ్య‌క్తిత్వం మీరు.. మొక్క‌వోని ధైర్యంతో కొన‌సాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు ఆజ‌న్మాంతం త‌లుచుకునే అశ్రుక‌ణం మీరే' అంటూ ఆయ‌న కుమారులు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
hari krishna
Jr NTR
Chandrababu
Nara Lokesh

More Telugu News