Chiranjeevi: తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు: చిరంజీవి

chiru wishes pawan
  • చిన్నప్పటి నుంచి సమాజం గురించే కల్యాణ్ ప్రతి ఆలోచన
  • పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం
  • తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
జనసేన అధినేత, త‌న చిన్న త‌మ్ముడు ప‌వన్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిత్వాన్ని చిరంజీవి కొనియాడారు. ఆయ‌న ల‌క్ష్యం నెర‌వేరాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.

'చిన్నప్పటి నుంచి సమాజం గురించే కల్యాణ్ ప్రతి ఆలోచన... ప్రతి అడుగు. పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం క‌ల్యాణ్‌. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
Pawan Kalyan
Janasena

More Telugu News