Classic 350: 'క్లాసిక్' బండిని సరికొత్తగా ముస్తాబు చేసి తీసుకువచ్చిన రాయల్ ఎన్ ఫీల్డ్

Royal Enfield brings all new Classic 350
  • భారత మార్కెట్లోకి క్లాసిక్ 350
  • అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్
  • ప్రారంభ ధర రూ.1.84 లక్షలు
  • 11 రంగుల్లో లభ్యం కానున్న కొత్త క్లాసిక్
రాయల్ ఎన్ ఫీల్డ్... పేరుకు తగ్గట్టుగానే రాజసం ఉట్టిపడే ద్విచక్రవాహనాలను రూపొందిస్తూ దశాబ్దాలుగా హవా కొనసాగిస్తోంది. బుల్లెట్ మోడల్ తో అన్ని వర్గాల మనసులను దోచుకున్న రాయల్ ఎన్ ఫీల్డ్ కు మరో మోడల్ అత్యంత లాభసాటిగా నిలుస్తోంది. అది క్లాసిక్ మోడల్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాజాగా సరికొత్త హంగులతో క్లాసిక్ 350 మోడల్ ను రాయల్ ఎన్ ఫీల్డ్ భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. 11 రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.84 లక్షలు కాగా, హై ఎండ్ మోడల్ ధరను రూ.2.15 లక్షలుగా నిర్ణయించారు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.

దీంట్లో అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు పొందుపరిచారు. కన్సోల్ విషయానికొస్తే డిజిటల్-అనలాగ్ మీటర్ తో సరికొత్తగా కనిపించనుంది. దీనికి ఐదు గేర్లు ఉంటాయి. 349 సీసీ ఇంజిన్ తో 20.2 బీహెచ్ పీ శక్తిని అందిస్తుంది.
Classic 350
Royal Enfiled
New Model
India

More Telugu News