YS Sharmila: ఇడుపులపాయకు బయల్దేరిన వైఎస్ షర్మిల

YS Sharmila gone to Idupulapaya
  • రేపు వైఎస్సార్ వర్ధంతి
  • ఇడుపులపాయలో తండ్రికి నివాళి అర్పించనున్న షర్మిల
  • వైఎస్సార్టీపీ కార్యాలయంలో పలు కార్యక్రమాలు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయకు బయల్దేరారు. రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి. దీంతో, తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించేందుకు ఆమె ఇడుపులపాయకు వెళ్లారు. రేపు ఉదయం 7 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసి ఆమె నివాళి అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. రేపు సాయంత్రం హైదరాబాదులో విజయమ్మ నిర్వహించనున్న సంస్మరణ సభకు షర్మిల హాజరవుతారు. మరోవైపు వైఎస్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్టీపీ కార్యాలయంలో జాబ్ మేళా, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.
YS Sharmila
YSRTP
Idupulapaya

More Telugu News