Vishal: విశాల్ నుంచి మరో భారీ యాక్షన్ మూవీ!

Vishal 32 movie launching video released
  • విశాల్ నుంచి 32వ సినిమా
  • యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
  • కథానాయికగా సునైన  
  • పాన్ ఇండియా స్థాయిలో విడుదల
తమిళనాట విశాల్ కి మాస్ యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. తెలుగులోను ఆయన అదే పేరును సంపాదించుకున్నాడు. తన సినిమా హిట్ అయినా .. ఫ్లాప్ అయినా ఆ తరువాత సినిమా విషయంలో విశాల్ ఎంతమాత్రం ఆలస్యం చేయడు. అభిమానులతో తనకి ఎంతమాత్రం గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఆయన తన 32వ సినిమాను పట్టాలెక్కించాడు.

ఆయన తాజా చిత్రం కూడా యాక్షన్ కి పెద్దపీట వేస్తూ సాగనుంది. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, మొన్న విశాల్ పుట్టినరోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఆ తరువాత రోజునే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన వీడియోను తాజాగా రిలీజ్ చేశారు.

రమణ - నంద కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమాలో విశాల్ సరసన నాయికగా సునైన అలరించనుంది. దిలీప్ సుబ్బరాయన్ ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అన్ని భాషల్లో ఒకటే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
Vishal
Sunaina
Kollywood

More Telugu News