Chiranjeevi: తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi met Tamilnadu CM MK Stalin in Chennai
  • చెన్నై వెళ్లిన చిరంజీవి
  • స్టాలిన్ తో మర్యాదపూర్వక భేటీ
  • స్టాలిన్ కు అభినందనలు
  • పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పిన వైనం
టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి నేడు చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను కలిశారు. తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత స్టాలిన్ తనదైన శైలిలో పాలన చేపడుతూ, అందరి అభినందనలు అందుకుంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన స్టాలిన్ కొన్ని నెలల వ్యవధిలోనే ఉత్తమ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో, సీఎం స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి ఆయనను అభినందించారు. స్టాలిన్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పారు. ఈ సందర్భంగా అక్కడ స్టాలిన్ తనయుడు ఉదయనిధి కూడా ఉన్నారు.
Chiranjeevi
MK Stalin
Tamilnadu CM
Udayanidhi
Chennai

More Telugu News