Naveen Polishetty: కథ నచ్చలేదట.. అడ్వాన్స్ తిరిగిచ్చేసిన యువ హీరో!

Naveen Polishetty returns advance amount to the producer
  • 'జాతిరత్నాలు'తో నవీన్ పోలిశెట్టికి క్రేజ్ 
  • కొన్ని చిత్రాలు కమిట్ అయిన నవీన్
  • సితార ఎంటర్టైన్మెంట్స్ తో సినిమా డీల్
  • కథ నచ్చకపోవడంతో రూ.4 కోట్లు వెనక్కి  

ఇప్పుడు మన యువ హీరోలు కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటున్నారు. కొత్త సినిమాలు చేయడంలో ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేస్తున్నారు. ఆఫర్ వచ్చింది కదా అని చెప్పి, ఏది పడితే అది ఒప్పేసుకోవడంలేదు. కథ నచ్చకపోయినా.. పాత్ర తీరుతెన్నులు సంతృప్తికరంగా లేకపోయినా 'సారీ' చెప్పి ఆ ప్రాజక్టు నుంచి తప్పుకుంటున్నారు. ఇందులో మొహమాటాలకు పోవడం లేదు. తాజాగా యువ హీరో నవీన్ పోలిశెట్టి కూడా అలాగే ఓ చిత్రం నుంచి బయటకు వచ్చేశాడట.

ఆమధ్య విడుదలైన 'జాతిరత్నాలు' సినిమాతో హీరో నవీన్ కెరీర్ మంచి ఊపందుకుంది. యూత్ లో మంచి క్రేజ్ రావడంతో.. వరుసగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. వాటిలో కొన్ని బ్యానర్లకు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. అలా సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి డీల్ కుదుర్చుకుని, నాలుగు కోట్ల పారితోషికం కూడా తీసుకున్నాడట.

అయితే, ఆ నిర్మాతలు చెప్పించిన కథ నవీన్ కి నచ్చలేదట. దాంతో మార్పులు చేర్పులు చెప్పాడట. మళ్లీ ఆయన చెప్పిన విధంగా రచయితలు కథతో కుస్తీ పట్టినప్పటికీ, నవీన్ కి ఆ కథ సంతృప్తికరంగా అనిపించలేదట. దాంతో ఆ ప్రాజక్టు నుంచి తప్పుకుంటూ, తాను తీసుకున్న నాలుగు కోట్ల మొత్తాన్ని సదరు నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాడని టాలీవుడ్ సమాచారం.

  • Loading...

More Telugu News