Dogs: మిలిటరీ జాగిలాలను ఆఫ్ఘనిస్థాన్ లోనే వదిలేసిన అమెరికాపై విమర్శలు

US Military left alone their dogs in Afghanistan
  • ఆఫ్ఘన్ గడ్డపై శునకాల సేవలు
  • అమెరికా దళాల్లో కీలకపాత్ర పోషించిన జాగిలాలు
  • ఆగస్టు 31 లోపే నిష్క్రమించిన అమెరికా
  • శునకాల తరలింపును విస్మరించిన వైనం

ఆఫ్ఘనిస్థాన్ నుంచి నిష్క్రమించేందుకు అమెరికా విధించుకున్న గడువు ఆగస్టు 31. గడువులోపే అమెరికా దళాలు ఆఫ్ఘన్ ను వీడాయి. అయితే తొందరపాటులో తమ మిలిటరీ జాగిలాలను మాత్రం అక్కడే వదిలేసి వెళ్లాయి.

దీనిపై తీవ్ర స్పందనలు వ్యక్తమయ్యాయి. ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా సైనికులకు విశేష సేవలు అందించిన శునకాలను వదిలేసి వస్తారా? అంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మేలుజాతి జాగిలాలను కాబూల్ లో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పరిరక్షిస్తోంది. త్వరలోనే వీటిని అమెరికాకు తరలించాలని భావిస్తోంది.

భారత్ ఇటీవలే ఆఫ్ఘనిస్థాన్ లో గత మూడేళ్లుగా సేవలందించిన జాగిలాలను స్వదేశానికి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. భారత్ ఎంతో జాగ్రత్తగా శునకాలను తరలించగా, అమెరికా మాత్రం వాటిని విస్మరించిందంటూ బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News