Virat Kohli: టెస్టు ర్యాంకింగ్స్ లో ఆరో స్థానానికి పడిపోయిన కోహ్లీ

Kohli dropped to sixth spot in ICC Test Batting Rankings
  • టెస్టు ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
  • నెంబర్ వన్ స్థానంలో జో రూట్
  • వరుసగా సెంచరీలు బాదిన రూట్
  • ఐదో ర్యాంకుకు చేరుకున్న రోహిత్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకులు విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 'ఐదు' నుంచి ఆరోస్థానానికి పడిపోయాడు. ఫామ్ లో ఉన్న 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపరుచుకుని ఐదోస్థానానికి చేరుకున్నాడు. ఇక, వరుసగా సెంచరీల మోత మోగిస్తున్న ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి జో రూట్ ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని అలంకరించాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను కిందికినెట్టిన రూట్ ర్యాంకుల జాబితాలో నెంబవర్ స్థానంలో నిలిచాడు.

బౌలింగ్ ర్యాంకుల్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని పదో ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలింగ్ జాబితాలో ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఎలాంటి మార్పులేదు. టీమిండియాతో టెస్టు సిరీస్ లో విశేషంగా రాణిస్తున్న ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ 'ఆరు' నుంచి ఐదోస్థానానికి చేరుకున్నాడు.
Virat Kohli
Batting Rankings
Test
ICC
India

More Telugu News