Kurnool: కర్నూలులో ఏపీ మావన హక్కుల కార్యాలయం ప్రారంభం

HRC office started in Kurmool
  • కార్యాలయాన్ని ప్రారంభించిన జస్టిస్ సీతారామమూర్తి
  • సమయాభావం వల్ల స్టేట్ గెస్ట్ హౌస్ లో కార్యాలయం ఏర్పాటు
  • కరోనా వల్ల ఆన్ లైన్ లోనే ఫిర్యాదుల స్వీకరణ
కర్నూలు నగరానికి మరో కార్యాలయం తరలి వచ్చింది. నగరాన్ని న్యాయ రాజధానిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించింది. ఈరోజు హ్యూమర్ రైట్స్ కమిషన్ కార్యాలయం కర్నూలులో ప్రారంభమైంది. ఆ సంస్థ ఛైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి కార్యాలయాన్ని ప్రారంభించారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా ఉన్నందువల్ల స్టేట్ గెస్ట్ హౌస్ లోనే తాత్కాలికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారానే ఫిర్యాదులను స్వీకరిస్తామని అన్నారు.
Kurnool
HRC

More Telugu News