ఈడీ కార్యాలయంలో ముగిసిన పూరీ జగన్నాథ్ పై విచారణ

  • టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కోణం
  • విచారణ షురూ చేసిన ఈడీ
  • టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు
  • నేడు పూరీ జగన్నాథ్ పై విచారణ
  • 10 గంటల పాటు సాగిన విచారణ
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణ ముగిసింది. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ అంశాలకు సంబంధించి ఈడీ అధికారులు ఈ ఉదయం నుంచి పూరీ జగన్నాథ్ ను విచారించారు. ఉదయం 10 గంటల తర్వాత మొదలైన విచారణ దాదాపు 10 గంటల పాటు సాగింది. పూరీ జగన్నాథ్ కు ఈడీ అధికారులు మధ్యలో ఓసారి భోజన విరామం ఇచ్చారు. పూరీ జగన్నాథ్ తో పాటు ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీధర్ ను కూడా విచారించారు. ప్రధానంగా మనీలాండరింగ్ గురించే ప్రశ్నించినట్టు తెలుస్తోంది.


More Telugu News

Puri Jagannadh ED Drugs Case Tollywood