Ayyanna Patrudu: లోకేశ్ భాష గురించి కన్నబాబు మాట్లాడడమా?: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu fires on minister Kurasala Kannababu
  • కన్నబాబు వర్సెస్ అయ్యన్న
  • రాష్ట్రం మీ తాత జాగీరా అంటూ అయ్యన్న ఫైర్
  • లోకేశ్ జనంలోనే ఉన్నాడని వెల్లడి
  • జగన్ తాడేపల్లి గడప దాటడంలేదని ఎద్దేవా
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వైసీపీ మంత్రి కురసాల కన్నబాబుపై ధ్వజమెత్తారు. ఏ పార్టీ రోటికాడ ఆ పార్టీ పాట పాడే కురసాల కన్నబాబు.... లోకేశ్ భాష గురించి మాట్లాడడమా? అని వ్యాఖ్యానించారు. మీ సహచర మంత్రి కొడాలి నాని అంత సభ్యతగా లోకేశ్ మాట్లాడలేదని బాధపడుతున్నావా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

"నారా లోకేశ్ ను బయట తిరగనివ్వనంటున్నావు... రాష్ట్రం మీ తాత జాగీరు అనుకుంటున్నావా? మా లోకేశ్ రెండున్నరేళ్లుగా జనంలోనే ధైర్యంగా తిరుగుతున్నాడు. మీ జగనే తాడేపల్లి గడప దాటి రెండేళ్లు దాటింది. ఓసారి బయటికి రమ్మను... పోవాలి జగన్, మాకొద్దు జగన్ అంటూ జనం రాళ్లతో కొడతారు" అంటూ అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Ayyanna Patrudu
Kurasala Kannababu
Nara Lokesh
YS Jagan
TDP
YSRCP

More Telugu News