ఎవరూ దాడి చేయలేదు.. తనకు తానే గొంతు కోసుకుంది: కామారెడ్డి ఘటనపై పోలీసులు

Shocking Update Into Kamareddy Attack Incident
  • 9 నెలల క్రితం వివాహం
  • 2 నెలల క్రితం ఆత్మహత్యాయత్నం
  • ప్రేమ వ్యవహారమే కారణమన్న అనుమానం
కామారెడ్డి దాడి ఘటనలో పోలీసులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేశాడన్న యువతి మాటలు బూటకమని తేల్చారు. ఆమెకు 9 నెలల క్రితం కామారెడ్డికి చెందిన యువకుడితో వివాహమైందని పోలీసులు చెప్పారు.

అయితే, అంతకుముందు ప్రేమ వ్యవహారం వల్లే ఆమె తనకు తాను గొంతుకోసుకుని ఈ నాటకమాడి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితమూ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
Go Back to Shorts
Telangana
Crime News
Kamareddy District
Police
TS Police

More Telugu News