Afghanistan: తాలిబన్లు వచ్చేలోపు ఆయుధాలు, యుద్ధవిమానాలు హెలికాప్టర్లను పనికిరాకుండా చేసిన అమెరికా

US Disable Every Weapon That Left Behind Before Taliban Occupation Of Kabul Airport
  • 73 యుద్ధ విమానాలు నిరుపయోగం
  • 20 హమ్వీ వాహనాలూ నాశనం
  • రాకెట్ నిరోధక వ్యవస్థలూ డిజేబుల్
  • వెల్లడించిన సెంట్రల్ కమాండ్ అధికారి
ప్రపంచంలోని అత్యంత ఆధునికమైన ఆయుధాలవి. సైన్యాన్ని, ప్రజలను అయితే అమెరికా తీసుకెళ్లగలిగిందిగానీ.. వాటిని మాత్రం తీసుకెళ్లలేకపోయింది. మరి, అవన్నీ తాలిబన్ల చేతికి చిక్కితే ఏమైనా ఉందా? అన్ని చేసిన అమెరికా.. ఈ ఆలోచన చేయకుండా ఉంటుందా! అందుకే ఆఫ్ఘన్ గడ్డ మీద వదిలేసిన ఆయుధాలను పనికిరాకుండా చేసింది.

తాలిబన్లకు ఆయుధాలు దక్కినా నిరుపయోగంగానే ఉండాలని భావించిన అమెరికా.. వెళ్తూవెళ్తూ ముందు జాగ్రత్తగా ఆయుధాలు, వాహనాలను పనికిరాకుండా చేసేసింది. తాలిబన్లు కాబూల్ ఎయిర్ పోర్ట్ లోకి వచ్చేలోపు ఆ పనిని కానిచ్చేసింది. కాబూల్ ఎయిర్ పోర్టులో ఉన్న 73 విమానాల్లోని ఆయుధాలను తీసేశామని, పనిచేయకుండా చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కెన్నెత్ మెకింజీ చెప్పారు.

‘‘ఆ విమానాలేవీ ఎగరలేవు. ఎవరూ వాటిని తిరిగి ఉపయోగించలేరు’’ అని ఆయన చెప్పారు. 27 హమ్వీ వాహనాలనూ పాడు చేశామన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్లను నాశనం చేసే సీ ర్యామ్స్ వ్యవస్థను చివరి నిమిషం వరకు వుంచుకున్న అమెరికా.. పోయేముందు దానినీ నాశనం చేసింది. ఇటు 70 ఎంఆర్ఏపీ వాహనాలనూ వదిలేశామని, అవీ తాలిబన్లకు ఏ విధంగానూ ఉపయోగపడవని చెప్పారు. ఈ ఒక్కొక్క ఎంఆర్ఏపీ వాహనాల విలువ 10 లక్షల డాలర్లన్నారు. మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ లో అడుగు పెట్టే అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకే వాటిని పేల్చేయకుండా వెళ్లిపోతున్నామన్నారు.
Afghanistan
Kabul Airport
Taliban
USA

More Telugu News