Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Anupama Parameshvaran pairs up with Nikhil for Kartikeya sequel
  • 'కార్తికేయ' సీక్వెల్ నాయికగా అనుపమ
  • మరో తమిళ రీమేక్ లో చిరంజీవి
  • సమంత చేయాలనుకుంటున్న పాత్ర  
*  ప్రస్తుతం నిఖిల్ సరసన '18 పేజెస్' సినిమాలో నటిస్తున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ తో మరో సినిమా చేస్తోంది. 'కార్తికేయ 2' సినిమాలో నిఖిల్ కి జోడీగా అనుపమ నటిస్తుందంటూ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తారు.  
*  ఇటీవలే 'ఆచార్య' చిత్రాన్ని పూర్తిచేసి, ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. దీని తర్వాత మెహర్ రమేశ్, బాబీ రూపొందించే చిత్రాలలో కూడా నటించనున్నారు. ఈ క్రమంలో మరో తమిళ రీమేక్ ను చేసే ఉద్దేశంలో మెగాస్టార్ ఉన్నట్టు సమాచారం. అజిత్ హీరోగా వచ్చిన 'ఎన్నై అరిందాల్' చిత్రాన్ని ఆయన తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ వెంకీ కుడుముల, మారుతిలలో ఒకరికి దక్కచ్చు!
*  సూపర్ హీరో తరహా పాత్ర ఒకటి పోషించాలనేది తన డ్రీమ్ అని చెబుతోంది కథానాయిక సమంత. "కష్టాలలో వున్నప్పుడు సహాయం కోసం అరిచే తరహా పాత్రలంటే నాకు ఇష్టం వుండదు. మనకు మనమే ఫైట్ చేసుకుని బయటపడగలిగే తరహా సూపర్ హీరో పాత్రలాంటిది చేయాలని వుంది. చూద్దాం.. నా డ్రీమ్ క్యారెక్టర్ పోషించే అవకాశం ఎప్పుడు వస్తుందో.." అని చెప్పింది సమంత.
Anupama
Nikhil
Chiranjeevi
Samanta

More Telugu News