అన్ని వేరియంట్లను తట్టుకునేలా ఒకే వ్యాక్సిన్ తయారు చేయాలి: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య
- వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ భారీగానే కరోనా కేసులు
- రకరకాల వేరియంట్లు పుట్టుకొస్తుండటమే కారణం
- వ్యాక్సిన్ తయారీకి అన్ని దేశాలు సహకరించాలన్న సౌమ్య
కరోనాలో అన్ని వేరియంట్లను తట్టుకునేలా ఒకే వ్యాక్సిన్ ను తయారు చేయాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఈ తరహా వ్యాక్సిన్ అభివృద్ధికి అన్ని దేశాలు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే మహమ్మారుల నుంచి రక్షణ పొందాలంటే ఈ రకమైన వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు.