Bandi Sanjay: కార్యకర్తల తోపులాట... బండి సంజయ్ కాలికి గాయం

Injury to Bandi Sanjay during padayatra
  • మూడో రోజుకు చేరిన సంజయ్ పాదయాత్ర
  • ఆయనను కలిసేందుకు పోటీపడ్డ అభిమానులు 
  • అదుపుతప్పి కిందపడ్డ సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గాయపడ్డారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు లంగర్ హౌస్ ప్రాంతంలో పాదయాత్రను కొనసాగిస్తుండగా... ఆయనను కలిసేందుకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట చోటుచేసుకుంది. అభిమానులు ఒక్కసారిగా రావడంతో ఆయన అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో, ఆయన కుడికాలికి గాయమైంది. ఆయనకు అక్కడే చికిత్స అందించిన వైద్యులు, కాలికి ప్లాస్టర్ వేశారు. ఆయన యాత్ర యథావిధిగా కొనసాగుతుందని బీజేపీ నేతలు తెలిపారు.
Bandi Sanjay
BJP
Padayatra
Injury

More Telugu News