బుట్టబొమ్మలా పూజ, స్టయిలిష్ గా ప్రభాస్​.. క్లాసిక్​ గా ‘రాధేశ్యామ్​’ కొత్త పోస్టర్ విడుదల​!

Here Comes The Radhe Shyam First Look Poster
షార్ట్స్‌లో చూడండి
ప్రేమకు ప్రతిరూపం రాధాకృష్ణులు. అలాంటి ప్రేమకథతోనే ‘రాధే శ్యామ్’గా వస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పుజ హెగ్డేలు. ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది.

నెమలి పింఛాలతో కూడిన నీలి రంగు గౌనును ధరించిన పూజ.. పియానో వాయిస్తుండగా, జెంటిల్ మ్యాన్ లుక్ లో ప్రభాస్ ఆ వైపు చిరునవ్వులను చిందిస్తూ ఆప్యాయంగా చూస్తున్న ఆ పోస్టర్ క్లాసిక్ గా అనిపిస్తోంది. ఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ప్రేక్షకులు మరచిపోలేని అనుభూతిని థియేటర్ల నుంచి తీసుకెళ్లేలా సినిమాను రూపొందిస్తున్నామని, ఎక్కడా ఎలాంటి చాన్స్ తీసుకోవట్లేదని దర్శకుడు రాధాకృష్ణ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 14న సినిమాను విడుదల చేస్తామన్నారు. జన్మాష్టమి రోజున రాధేశ్యామ్ పోస్టర్ ను విడుదల చేయడం ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు.

1970ల్లో యూరప్ లో సాగిన భారతీయ జంట ప్రేమ కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటలీ, జార్జియా, హైదరాబాద్ లలోనే సింహభాగం షూటింగ్ ను చేశారు. భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ లు సినిమాను నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, టీ సిరీస్ లు సమర్పకులుగా ఉన్నారు.

Go Back to Shorts
Radhe Shyam
Prabhas
Pooja Hegde
Tollywood
Radha Krishna Kumar
UV Creations
T Series
Gulshan Kumar

More Telugu News