స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

  • రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
  • నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
  • రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు భారీ నుంచి అతి భారీ, రేపు (మంగళవారం) భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. నిన్న కూడా రాష్ట్రవాప్తంగా వర్షాలు పడ్డాయి. కుమురంభీం జిల్లా సిర్పూరులో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరోవైపు, బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులు అస్థిరంగా కదులుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Telangana
Monsoon
Rains

More Telugu News