Ex Army Soldier: గుంటూరు జిల్లాలో కాల్పులు జరిపిన మాజీ సైనికుడు... ఇద్దరి మృతి

Ex army solider firing at men in Guntur district
  • మాచర్ల మండలంలో కాల్పుల కలకలం
  • రాయవరం గ్రామంలో పొలం వివాదం
  • ఇరువర్గాల మధ్య ఘర్షణ
  • తుపాకీ తీసిన మాజీ సైనికుడు
  • 8 రౌండ్ల కాల్పులు
గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో మట్టా సాంబశివరావు అనే మాజీ సైనికుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఓ పొలం వివాదం నేపథ్యంలో 8 రౌండ్లు కాల్పులు జరపగా, ఇద్దరు మృతి చెందారు. మృతి చెందినవారిని శివ, బాలకృష్ణ అనే వ్యక్తులుగా గుర్తించారు. వీరిద్దరూ రైతులు. ఈ ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పొలంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో... మాజీ సైనికుడు సాంబశివరావుకు, శివ, బాలకృష్ణ తదితరులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఘర్షణ ముదరడంతో సాంబశివరావు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శివ, బాలకృష్ణ సంఘటన స్థలంలోనే కుప్పకూలారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ సైనికుడు సాంబశివరావును అరెస్ట్ చేశారు.
Ex Army Soldier
Firing
Death
Rayavaram
Macherla
Guntur District

More Telugu News