టీచర్ అవతారం ఎత్తిన రోజా... ఫొటోలు ఇవిగో!

YCP MLA Roja turns teacher
షార్ట్స్‌లో చూడండి
రాజకీయాలు, ప్రజాభివృద్ధి పనులతో బిజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉపాధ్యాయురాలిగా మారారు. చిత్తూరు జిల్లా అత్తూరు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. సాంఘికశాస్త్రంలోని భూమి-మనం అనే పాఠాన్ని బోధించారు. పాఠం చెప్పిన అనంతరం తాను చెప్పిన విషయాలు అర్థమయ్యాయో లేదో తెలుసుకునేందుకు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. అత్తూరులోని జడ్పీ హైస్కూల్ భవనాన్ని ఇటీవల ఆధునికీకరించారు. ఈ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా రోజా టీచర్ అవతారమెత్తారు.
Go Back to Shorts
Roja
Teacher
YCP MLA
Chittoor District
YSRCP
Andhra Pradesh

More Telugu News