Amaravati: మంత్రి పదవిని కాపాడుకునేందుకు బొత్స అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారు: జేఏసీ నేతలు

Amaravathi leaders fires on minister Botsa
  • మంత్రి బొత్సపై అమరావతి జేఏసీ ధ్వజం
  • అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు
  • అమరావతిలో తిరగనివ్వబోమని హెచ్చరిక
  • నేరుగా సీఎం జగన్ తోనే చర్చలు జరుపుతామని వెల్లడి
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై అమరావతి జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. మంత్రి బొత్స ఏమాత్రం అవగాహన లేకుండా రాజధాని అమరావతిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోసారి నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తే అమరావతిలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.

ఇలాంటి విషయ పరిజ్ఞానం లేని మంత్రులను సీఎం జగన్ దూరం పెట్టాలని, లేకపోతే ప్రభుత్వానికే తీవ్ర నష్టం అని వారు స్పష్టం చేశారు. తన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే బొత్స అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. రాజధాని అంశంపై తాము సీఎం జగన్ తోనే నేరుగా చర్చిస్తామని వారు తేల్చి చెప్పారు. తమతో చర్చించే అర్హత బొత్సకు లేదన్నారు.
Amaravati
JAC
Botsa Satyanarayana
CM Jagan
AP Capital

More Telugu News