Anurag Thakur: స్కిప్పింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి... వీడియో ఇదిగో!

Union Sports minister Anurag Thakur performs his skipping skills
  • నేడు జాతీయ క్రీడల దినోత్సవం
  • ఢిల్లీలో ఫిట్ ఇండియా యాప్ ఆవిష్కరణ
  • కార్యక్రమానికి హాజరైన అనురాగ్ ఠాకూర్
  • స్కిప్పింగ్ లో పలు విన్యాసాల ప్రదర్శన
ఇటీవల కేంద్ర క్రీడల మంత్రిగా ప్రమోషన్ అందుకున్న అనురాగ్ ఠాకూర్ ఇవాళ ఓ కార్యక్రమంలో తన స్కిప్పింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో నేడు ఫిట్ ఇండియా మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అలవోకగా స్కిప్పింగ్ చేస్తూ, అందులో పలు విన్యాసాలు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు చప్పట్లతో ఆయన్ను ప్రోత్సహిస్తుండగా, మరింత హుషారుగా స్కిప్పింగ్ చేస్తూ ఫిట్ నెస్ ఆవశ్యకతను చాటారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. కాగా ఫిట్ ఇండియా యాప్ ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరు తమ ఫిట్ నెస్ ను పరీక్షించుకునేందుకు వీలుగా ఈ యాప్ కు రూపకల్పన చేశారు.
Anurag Thakur
Skipping
Fit India App
New Delhi
National Sports Day

More Telugu News