YSR: వైఎస్ వర్ధంతి నాడు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం.. రాజశేఖరరెడ్డితో పనిచేసిన నేతలకు విజయమ్మ ఆహ్వానం

YS Vijayamma Invite then ministers who work along with ysr
  • సెప్టెంబరు 2న వైఎస్సార్ వర్ధంతి
  • పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం
  • ఉండవల్లి, కేవీపీ, డి.శ్రీనివాస్ వంటి వారికి ఆహ్వానం
వచ్చే నెల 2న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆయన భార్య విజయమ్మ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన పలువురు నేతలను ఆహ్వానించాలని విజయమ్మ నిర్ణయించినట్టు తెలిసింది. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.

అప్పట్లో వైఎస్‌తో కలిసి పనిచేసిన నేతలు.. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి వంటి వారితోపాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన వారిని, రాజకీయ సహచరులు, శ్రేయోభిలాషులను కూడా విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.
YSR
YS Vijayamma
Hyderabad

More Telugu News