హెడింగ్లే టెస్టులో ఓటమి అంచున భారత్
- 215/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్
- వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన వైనం
- 42 పరుగుల తేడాతో 6 వికెట్లు డౌన్
- రాబిన్సన్ కు 5 వికెట్లు
అంతకుముందు, పుజారాను అవుట్ చేయడం ద్వారా భారత్ పతనానికి ఓల్లీ రాబిన్సన్ శ్రీకారం చుట్టాడు. సెంచరీకి 9 పరుగుల దూరంలో పుజారా అవుట్ కాగా, ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ కోహ్లీ (55), రహానే (10) కూడా వెనుదిరిగారు. పంత్ కేవలం 1 పరుగు చేసి నిరాశపరిచాడు. రాబిన్సన్ కు 5 వికెట్లు లభించాయి.
భారత్ ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉన్న నేపథ్యంలో చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. పరిస్థితి చూస్తే ఇంగ్లండ్ మరోసారి బ్యాటింగ్ కు దిగాల్సిన అవసరం రాకపోవచ్చు.