Bandi Sanjay: రేపటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర

Bandi Sanjay set to kick start Praja Sangrama Yatra
  • ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ పాదయాత్ర
  • చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • నాలుగు విడతల్లో పాదయాత్ర
  • అక్టోబరు 2న ముగియనున్న తొలి విడత
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రేపటి నుంచి షురూ కానుంది. రేపు ఉదయం ముందుగా ఆయన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ హాజరు కానున్నారు.

ఇక బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర నాలుగు విడతల్లో కొనసాగనుంది. మొదటి విడత పాదయాత్ర అక్టోబరు 2న హుజూరాబాద్ లో ముగించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పాదయాత్ర రోజుకు పది కిలోమీటర్లు కొనసాగనుంది. కాగా, రేపు ప్రారంభం కానున్న ప్రజా సంగ్రామ యాత్ర తొలి రెండ్రోజులు హైదరాబాద్ పరిధిలోనే జరగనుంది.
Bandi Sanjay
Praja Sangrama Yatra
BJP
Telangana

More Telugu News