Dharmana Krishna Das: రెండు చోట్లా ఓడిపోయారు.. జగన్ తో పోల్చుకోకండి: పవన్ కు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన చురక

Dharmana suggests Pawan Kalyan not to compare him with Jagan
  • పవన్ రాజకీయాల్లో కంటే సినిమాల్లోనే మంచి నటుడు
  • పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
  • నారా లోకేశ్ ఆలోచించి మాట్లాడాలి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీని పెట్టిన పవన్ కల్యాణ్ రాష్ట్రమంతా తిరిగి రెండు చోట్ల పోటీ చేసి, ఆ రెండు స్థానాల్లో ఓడిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.

పవన్ రాజకీయాల్లో కంటే సినిమాల్లోనే మంచి నటుడని అన్నారు. రాజకీయాల విషయంలో పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పారు. పవన్ గారూ సీఎం జగన్ తో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి, ఆయనకు ఆయనే సాటి అని అన్నారు.

అలాగే, జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పిస్తుండటం హాస్యాస్పదంగా ఉందని ధర్మాన అన్నారు. లోకేశ్ ఏదైనా ఆలోచించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. శ్రీకాకుళంలో చేనేత బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Dharmana Krishna Das
Jagan
YSRCP
Pawan Kalyan
Janasena
Nara Lokesh
Telugudesam

More Telugu News