వైసీపీ ఎంపీ విజయసాయికి సీబీఐ కోర్టులో ఊరట.. విదేశాలు వెళ్లేందుకు అనుమతి
- తీర ప్రాంత అభివృద్ధిపై అధ్యయనానికి విదేశాలకు వెళ్లాల్సి ఉందన్న విజయసాయి
- రూ. 5 లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన అనుమతి
- దుబాయ్, మాల్దీవులు, బాలీ పర్యటనకు విజయసాయి
తీరప్రాంతమైన విశాఖపట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా తీర ప్రాంత దేశాలైన దుబాయ్, మాల్దీవులు, బాలిలో అధ్యయనం చేయడానికి ఎంపీ హోదాలో పర్యటించేందుకు అనుమతివ్వాలని విజయసాయి ఆ పిటిషన్‌లో కోరారు. దీనిని విచారించిన సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు వాదనల అనంతరం విజయసాయి విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, పర్యటనకు ముందు రూ. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని పేర్కొంటూ షరతులతో కూడిన అనుమతినిచ్చారు.