బోనులో ఫొటోషూట్.. మోడల్‌పై చిరుతల దాడి!
- జర్మనీలోని ప్రైవేటు ప్రాపర్టీలో ఫొటోషూట్
- చిరుత బోనులోకి స్వయంగా వెళ్లిన జెస్సికా లేడాల్ఫ్
- షూట్ మధ్యలో ఆమెపై దాడి చేసిన చిరుతలు
ఆ సమయంలోనే రెండు చిరుతలు ఆమెపై దాడి చేశాయి. ‘‘అవి నా బుగ్గలు, చెవి, తలను కొరుకుతూనే ఉన్నాయి’’ అని జెస్సికా తెలిపింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, అయితే ఆమె శరీరంపై గాట్లు అలాగే ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ఈ ఫొటోషూట్ ఎవరు నిర్వహించిందీ ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అయితే ప్రజలకు ఎటువంటి భయమూ అక్కర్లేదని స్థానిక అధికారులు చెప్పారు. ఈ దాడి చేసిన రెండు చిరుతలు .. పానాసోనిక్ యాడ్‌లో ఒకసారి కనిపించినట్లు సమాచారం.