Sundeep Kishan: రేపటి నుంచే 'వివాహభోజనంబు' స్ట్రీమింగ్!

Vivaha Bhojanambu movie will stream on OTT
  • నిర్మాతగా సందీప్ కిషన్ నుంచి 'వివాహ భోజనంబు'
  • కథానాయకుడిగా కమెడియన్ సత్య తొలి సినిమా
  • సోనీ లివ్ ద్వారా వస్తున్న ఫస్టు తెలుగు మూవీ
  • హాస్య ప్రధానంగా సాగే కథాకథనాలు    

సందీప్ కిషన్ హీరోగానే కాదు ... నిర్మాతగా కూడా తన దూకుడు పెంచుతున్నాడు. హీరోగా ఆయన చేసిన 'గల్లీ రౌడీ' విడుదలకు ముస్తాబవుతూ ఉండగా, నిర్మాతగా చేసిన 'వివాహభోజనంబు' సినిమా రేపటి నుంచి 'సోనీ లివ్' ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. కమెడియన్ సత్య హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాతో, కథానాయికగా 'ఆర్జావి' తెలుగు తెరకి పరిచయం కానుంది.

జీవితాన్ని చాలా పొదుపుగా .. అదుపుగా గడుపుతున్న హీరో, పెళ్లి చేసుకుంటాడు. బంధువులంతా తన ఇంట్లో ఉన్నప్పుడు లాక్ డౌన్ పడుతుంది. అప్పుడు వాళ్లందరి ఖర్చును భరించలేక, అక్కడి నుంచి పంపించే మార్గం లేక ఆయన నానా తంటాలు పడుతుంటాడు. అదే సమయంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఠారెత్తి పోతాడు.

ఇలా లాక్ డౌన్ సమయంలో కొత్తగా పెళ్లైన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలాంటి తిప్పలు పడ్డాడనే కథతో ఈ సినిమా నడుస్తుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని సందీప్ కిషన్ చెబుతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ గెస్టు రోల్ లో కనిపించనున్నాడు.

  • Loading...

More Telugu News