Malla Reddy: ఈ సాయంత్రం వరకు రేవంత్ కు గడువిస్తున్నా.. సవాల్ కి కట్టుబడి ఉన్నా: మల్లారెడ్డి

I am giving time to Revanth Reddy till evening sasy Malla Reddy
  • రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి
  • నా సవాల్ ను రేవంత్ స్వీకరించాలి
  • కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ వాడిన భాషను చూసే తాను స్పందించానని వ్యాఖ్య
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి సవాల్ విసిరారు. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని... దమ్ము, ధైర్యం ఉంటే నీవు కూడా పీసీసీ, ఎంపీ పదవికి రాజీనామా చేయ్... ఇద్దరం మళ్లీ పోటీ చేద్దామని నిన్న మల్లారెడ్డి సవాల్ విసిరారు. నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఓడినోళ్లు ముక్కు నేలకు రాసి వెళ్లిపోవాలని అన్నారు.

ఈ రోజు మరోసారి ఇదే అంశంపై మల్లారెడ్డి మాట్లాడారు. ఈరోజు సాయంత్రం వరకు రేవంత్ రెడ్డికి సమయం ఇస్తున్నానని... తన సవాల్ ను రేవంత్ స్వీకరించాలని అన్నారు. తన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ రెడ్డి వాడిన భాషను చూసే తాను స్పందించానని చెప్పారు.
Malla Reddy
KCR
TRS
KTR
Revanth Reddy
Congress

More Telugu News