Prakash Raj: మా అబ్బాయి కోసం ఇవాళ మళ్లీ పెళ్లి చేసుకున్నాం: ప్రకాశ్ రాజ్

Prakash Raj shares interesting pics of his wedding anniversary
  • నేడు ప్రకాశ్ రాజ్-పోనీవర్మల పెళ్లిరోజు
  • ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్
  • తమ పెళ్లి చూడాలని కుమారుడు కోరినట్టు వెల్లడి
  • ఫొటోలు పంచుకున్న ప్రకాశ్ రాజ్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, పోనీ వర్మ దంపతులు ఇవాళ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. సినీ నటి డిస్కోశాంతి సోదరి లలితకుమారిని మొదటి వివాహం చేసుకున్న ప్రకాశ్ రాజ్ 2009లో ఆమెకు విడాకులిచ్చారు. ఆ మరుసటి ఏడాదే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీవర్మను ప్రకాశ్ రాజ్ రెండో వివాహం చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నారు. నేడు (ఆగస్టు 24) పెళ్లిరోజు కావడంతో ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు.

"ఇవాళ మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం. అందుకు కారణం మా అబ్బాయి వేదాంత్. మా పెళ్లి చూడాలని వాడు పట్టుబట్టడంతో మరోసారి ఒక్కటయ్యాం. కుటుంబంతో గడిపే క్షణాలు ఎప్పుడూ అమితానందాన్నిస్తాయి" అంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ప్రకాశ్ రాజ్ పంచుకున్నారు.

ఈ వేడుకల్లో ప్రకాశ్ రాజ్ కుమార్తెలు కూడా పాల్గొన్నారు. ప్రకాశ్ రాజ్ కు మొదటి భార్య లలితకుమారి ద్వారా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. అయితే కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు.
Prakash Raj
Wedding Anniversary
Pony Verma
Vedant

More Telugu News