CPI Ramakrishna: మంత్రి బొత్స ఒక బ్లఫ్ మాస్టర్ లా తయారయ్యారు: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna terms minister Botsa as a Bluff Master
  • మంత్రి బొత్సపై ధ్వజమెత్తిన రామకృష్ణ 
  • టిడ్కో ఇళ్లు ఏ విధంగా ఇస్తారో చెప్పాలన్న సీపీఐ నేత
  • ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు
  • బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని వెల్లడి
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు. మంత్రి బొత్స ఒక బ్లఫ్ మాస్టర్ లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. 'మేం ఏదన్నా అంశంపై ఉద్యమం చేస్తామని చెబితే చాలు... మంత్రి బొత్స వెంటనే ఏదో ఒక ప్రకటన చేసిన ప్రజలను మోసం చేస్తున్నారు' అంటూ విమర్శించారు. టిడ్కో ఇళ్లు ఏ విధానం ప్రకారం ఇస్తారో చెప్పాలని నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జంకుతున్నాయని రామకృష్ణ పేర్కొన్నారు. 
CPI Ramakrishna
Botsa Satyanarayana
Bluff Master
Andhra Pradesh

More Telugu News