Bhadradri Kothagudem District: నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి కేసు.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

Sexual assault case against a four year old girl Convict sentenced to 20 years rigorous imprisonment
  • చాక్లెట్లు కొనుక్కునేందుకు వచ్చిన చిన్నారి 
  • ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం
  • భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన
చాక్లెట్లు కొనుక్కునేందుకు దుకాణానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన నిందితుడిని దోషిగా తేల్చిన ఖమ్మం జిల్లా కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పింగళి గణేశ్ అలియాస్ చింటూ (20)కి కిరాణా దుకాణం ఉంది. గతేడాది నవంబరు 19న చాక్లెట్ కొనుక్కునేందుకు దుకాణం వద్దకు వచ్చిన బాలికను చూసిన చింటూ ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అనంతరం ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలికను చూసిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా చిన్నారి చెప్పింది విని విస్తుపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిన్న ఈ కేసు తుది విచారణకు రాగా, ఖమ్మం మొదటి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్ నిందితుడు గణేశ్‌ను దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
Bhadradri Kothagudem District
Rape Case
Convict
Court

More Telugu News