Pasupati Paras: కేంద్రమంత్రి పశుపతి పరాస్ పై ఇంకు చల్లిన మహిళ

women thrown ink union minister pasupati kumar paras
  • కేంద్ర మంత్రి అయ్యాక తొలిసారి తన నియోజకవర్గంలో పర్యటన
  • ఇంకు చల్లిన చిరాగ్ పాశ్వాన్ మద్దతురాలు
  • పార్టీలో చీలిక అనంతరం పరాస్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు
లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీలిక నేత, కేంద్రమంత్రి పశుపతి పరాస్ పై ఓ మహిళ ఇంకుతో దాడిచేసింది. కేంద్ర మంత్రివర్గంలో చేరిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గమైన బీహార్‌లోని హాజీపూర్ లో పర్యటించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

నిన్న హాజీపూర్ రాగా చిరాగ్ పాశ్వాన్ మద్దతురాలు అయిన మహిళ పశుపతి పరాస్ పై ఇంకు చల్లింది. దీంతో ఆయన ధరించిన కుర్తాపై ఇంకు మరకలు పడ్డాయి. కాసేపటి తర్వాత మంత్రి తన దుస్తులు మార్చుకుని యథావిధిగా తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు, నియోజకవర్గంలో పర్యటించిన ఆయనకు అడుగడుగునా నిరసనలు వినిపించాయి.
 
రాం విలాస్ పాశ్వాన్ చిన్న తమ్ముడే పశుపతి పరాస్. ఇటీవల పార్టీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన పరాస్.. రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి పార్టీకి తాను అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఆయనకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది.
Pasupati Paras
Bihar
Ink Attack
Chirag Paswan

More Telugu News