Arsha Khan: ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న బాలీవుడ్ నటి

Actress Arsha Khan cancels engagement with Afghanistan cricketer
  • ఈ ఏడాది అక్టోబర్ లో జరగాల్సిన అర్ష ఖాన్ నిశ్చితార్థం
  • ఆప్ఘన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడమే కారణం
  • అర్ష కుటుంబానికి ఆఫ్ఘనిస్థాన్ మూలాలు
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్ష ఖాన్ తన వివాహ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఆప్ఘనిస్థాన్ క్రికెటర్ తో ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే నిశ్చితార్థాన్ని రద్దుచేసుకున్నట్టు ఆమె ప్రకటించారు. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నప్పటికీ... ఇద్దరం మంచి మిత్రులుగా ఉంటామని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు హస్తగతం చేసుకోవడమే నిశ్చితార్థం రద్దు కావడానికి కారణమని తెలిపారు.

ఆఫ్ఘన్ సంక్షోభం వల్ల తనకు ఒక విషయం అర్థమయిందని... తనకు కాబోయే భర్త తప్పకుండా భారతీయ వ్యక్తే అయివుంటాడని చెప్పారు. తన కుటుంబానికి ఆప్ఘనిస్థాన్ మూలాలు ఉన్నాయని, తమది యూసుఫ్ జాయ్ జాతి అని తెలిపారు. అయితే తన తల్లిదండ్రులు, తాతల మాదిరే తాను కూడా భారతీయురాలినేనని చెప్పారు.
Arsha Khan
Bollywood
Afghanistan
Cricketer
Engagement

More Telugu News