Chandrababu: అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం నగదు ఇవ్వాలి: చంద్రబాబు డిమాండ్

  • గతంలో బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ 
  • బాధితులకు నగదు చెల్లిస్తామన్న ఏపీ సర్కారు
  • డిపాజిట్ దారులకు ఊరట కలిగించే ప్రయత్నం
  • పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్న చంద్రబాబు
Chandrababu demands full refund for Agrigold depositors

గతంలో అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసినవారికి తిరిగి నగదు చెల్లించేందుకు ఏపీ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు చెల్లింపులు చేయనున్నారు. ఈ నెల 19 నాటికి 7.7 లక్షల మంది డిపాజిట్ దారులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వారి ఖాతాలో ఎంత సొమ్ము బదలాయిస్తారన్నదానిపై స్పష్టతలేదు.

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం డిపాజిట్ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు అందరినీ, పూర్తిస్థాయిలో ఆదుకోవాలని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అండర్ వాల్యూకి ధారాదత్తం చేయరాదని స్పష్టం చేశారు.

More Telugu News