Raghu Rama Krishna Raju: ఎంపీ రఘురామకృష్ణరాజు  లేఖకు స్పందన.. ఏపీలో నాసిరకం మద్యాన్ని పరిశీలిస్తామన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

mansukh mandaviya responds to raghurama krishna raju letter
  • ఏపీలో నాసిరకం మద్యం ఏరులై పారుతోందని లేఖ
  • ఆ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపణ 
  • పరిశీలిస్తామన్న కేంద్ర ఆరోగ్య మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో నాసిరకం మద్యం ఏరులై పారుతోందని, కొన్ని బ్రాండ్లు, డిస్టిలరీలు తయారు చేస్తున్న మద్యం తాగుతున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారంటూ ఈ నెల 6న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. మద్యాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అందులో కోరారు. తాజాగా ఈ లేఖకు కేంద్రమంత్రి బదులిచ్చారు. లేఖ అందిందని అందులో పేర్కొన్న అంశాలను పరిశీలించి త్వరలోనే స్పందిస్తామని రఘురామకు మంత్రి బదులిచ్చారు. మద్యం ప్రభావాన్ని పరిశీలించి, త్వరలోనే వివరాలు తెలియజేస్తామని ఎంపీకి మంత్రి మాండవీయ తెలిపారు.
Raghu Rama Krishna Raju
Andhra Pradesh
Liquor
Mansukh Mandaviya

More Telugu News