PM Modi: కల్యాణ్ సింగ్ తన పేరును సార్థకం చేసుకున్నారు: ప్రధాని మోదీ

PM Modi pays tributes to Kalyan Singh
  • లోక కల్యాణం కోసం పాటుపడ్డారని కితాబు
  • ప్రజాక్షేమమే పరమావధిగా బతికారని వెల్లడి
  • నిన్న తుదిశ్వాస విడిచిన కల్యాణ్ సింగ్
  • లక్నోలో నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ లక్నోలో కల్యాణ్ సింగ్ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తుదివరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవించిన వ్యక్తి కల్యాణ్ సింగ్ అని కీర్తించారు.

కల్యాణ్ సింగ్ విలువైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, ఎంతో సమర్థుడైన నేత అని కొనియాడారు. నమ్మకానికి ప్రతిరూపంగా సామాన్య ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారని వెల్లడించారు. దేశం ఒక మంచి నాయకుడ్ని కోల్పోయిందని, ఆయన లేని లోటును తీర్చాలంటే, ఆయన ఆదర్శాలు, హామీలను నెరవేర్చడమే మార్గమని అన్నారు. అందుకు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

"తల్లిదండ్రులు ఆయనకు కల్యాణ్ సింగ్ అని పేరుపెట్టారు. ఆ పేరును సార్థకం చేసుకుంటూ లోక కల్యాణం కోసం అహర్నిశలు పాటుపడ్డారు. తన జీవితాన్ని బీజేపీ కోసం, భారతీయ జన్ సంఘ్ పరివారం కోసం అంకితమిచ్చారు" అని ప్రస్తుతించారు.
PM Modi
Kalyan Singh
Demise
BJP
Uttar Pradesh

More Telugu News