Madhu: కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది: సీపీఎం మధు

CPM Madhu criticizes BJP govt
  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన మధు
  • ఆర్థిక వనరులు హరిస్తోందని వ్యాఖ్యలు
  • విభజన హామీలు అమలు చేయడంలేదని ఆరోపణ
  • నిరసనలు చేపడతామని వెల్లడి
సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. అటవీ, మైనర్ పోర్టులపై చట్ట సవరణలు చేసి రాష్ట్రాల ఆర్థిక వనరులను హరిస్తోందని ఆరోపించారు. ఏపీకి విభజన హామీలు అమలు చేయడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 15 నుంచి 30 వరకు నిరసనలు చేపడతామని వెల్లడించారు.

ఇటు, వైసీపీ ప్రభుత్వం కూడా ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టడంలో విఫలమైందని మధు విమర్శించారు. పన్నుల చట్టాన్ని తెచ్చిన బీజేపీకి వైసీపీ మద్దతిస్తోందని అన్నారు.
Madhu
CPM
Andhra Pradesh
BJP
YSRCP

More Telugu News