Viral Videos: 'స‌లాం తాలిబ‌న్స్' అంటూ బాలిక‌లతో బ‌ల‌వంతంగా గీతం పాడించిన వైనం.. వీడియో వైర‌ల్

Video emerges of children allegedly being forced to sing praising Taliban
  • పాకిస్థాన్‌లో ఘ‌ట‌న‌
  • పాక్‌లో ప‌లుసార్లు చిన్నారుల‌పై తాలిబ‌న్ల దాడులు
  • అయిన‌ప్ప‌టికీ తాలిబ‌న్ల‌ను పొగుడుతూ పాట‌
  • తాలిబ‌న్ల‌ జెండాలు కూడా క‌న‌ప‌డ్డ వైనం
ఆఫ్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్లు అరాచ‌కాలు సృష్టిస్తుండ‌గా పాకిస్థాన్ మాత్రం ఆ ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతోన్న విష‌యం తెలిసిందే. బాలిక‌లకు స్వేచ్ఛ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే కాకుండా, వారు మ‌గ‌తోడు లేనిదేబ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని, చ‌దువుకోవ‌ద్ద‌ని చెప్పే తాలిబ‌న్ల‌ను పొగుడుతూ పాక్‌లో స‌మావేశాలు కూడా నిర్వ‌హిస్తుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాలిబ‌న్ల విప‌రీత చేష్ట‌ల‌ను పొగిడేలా బాలిక‌ల‌తో మ‌త పెద్ద‌లు గీతం ఆల‌పించేలా చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది.

పాకిస్థాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌లోని మ‌హిళ‌ల మ‌ద‌ర్సాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జామియా హ‌ఫ్సాకు చెందిన లాల్ మ‌సీద్ వ‌ద్ద తాలిబ‌న్లను పొగుడుతూ స‌మావేశం నిర్వ‌హించారు. ఆ ప్రాంతంలో తాలిబ‌న్ల జెండాలు కూడా క‌న‌ప‌డ్డాయి. దీంతో స్థానిక అధికారులు అక్క‌డ‌కు చేరుకుని తాలిబ‌న్ల జెండాల‌ను తొలిగించారు. పాకిస్థాన్‌లో చిన్నారుల‌పై తాలిబ‌న్లు చాలా సార్లు  దారుణాల‌కు పాల్ప‌డి చంపేశారు. అయిన‌ప్ప‌టికీ చిన్నారుల‌తోనే బ‌ల‌వంతంగా స‌లాం తాలిబ‌న్స్ అంటూ గీతం పాడించడం గ‌మ‌నార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.


Viral Videos
Taliban
Afghanistan
Pakistan

More Telugu News