CM Jagan: సీఎం జగన్ కు రాఖీ కట్టిన విడదల రజని, విజయవాడ మేయర్

YCP MLA Vidadala Rajani ties Raksha Bandhan to CM Jagan
  • రేపు రక్షా బంధన్ పర్వదినం
  • ముందుగానే రాఖీ కట్టిన విడదల రజని, రాయన భాగ్యలక్ష్మి
  • ఆశీర్వదించిన సీఎం జగన్
  • సీఎం క్యాంపు కార్యాలయంలో కోలాహలం
రేపు రక్షా బంధన్ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని సీఎం జగన్ కు ముందుగానే రాఖీ కట్టారు. సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన రజని తాను సోదరుడిగా భావించే జగన్ కు రాఖీ కట్టి మురిసిపోయారు. ఈ సందర్భంగా ఆయన విడదల రజనిని ఆశీర్వదించారు. కాగా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కోలాహలం నెలకొంది.
అటు, సీఎం జగన్ ఇవాళ విజయవాడలో ఐఏఎస్ అధికారులు కె.ప్రవీణ్ కుమార్, సునీత దంపతుల కుమారుడు పృథ్వి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. పృథ్వి, లిఖిత వివాహ విందు కార్యక్రమం విజయవాడలోని గుప్తా మ్యారేజి హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం జగన్ నూతన వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.
CM Jagan
Rakshabandhan
Vidadala Rajini
Rayana Bhagya Lakshmi
YSRCP
Andhra Pradesh

More Telugu News