Sandeep Sharma: చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న క్రికెటర్ సందీప్ శర్మ

Cricketer Sandeep Sharma married her childhood friend
  • సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్న సందీప్ శర్మ
  • తాషా సాత్విక్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న సందీప్
  • ఫ్యాషన్, నగల డిజైనర్ గా పని చేస్తున్న తాషా
ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వృత్తిరీత్యా తాషా ఫ్యాషన్, నగల డిజైనర్ గా పని చేస్తున్నారు. 2018లోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అయితే, కరోనా వల్ల పెళ్లి వాయిదా పడింది. నవ దంపతులు సందీప్, తాషాలకు సన్ రైజర్స్ హైదరాబాద్ శుభాకాంక్షలు తెలిపింది. సన్ రైజర్స్ కు పెళ్లికళ వచ్చిందని చమత్కరిస్తూ ట్వీట్ చేసింది. మిస్టర్ అండ్ మిసెస్ సందీప్ శర్మ... మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నామని తెలిపింది.
Sandeep Sharma
SRH
Cricketer
Marriage

More Telugu News