Keerthy Suresh: కాస్మెటిక్స్ వ్యాపారంలో అడుగుపెట్టిన అందాలభామ కీర్తి సురేశ్

Keerthy Suresh enters into skincare products business
  • కీర్తి సురేశ్ కొత్త బిజినెస్
  • భూమిత్ర బ్రాండ్ పేరుతో సౌందర్య ఉత్పత్తులు
  • తమ ప్రొడక్ట్స్ స్వచ్ఛమైనవంటున్న కీర్తి
  • ప్రాకృతిక పదార్థాలతో తయారుచేస్తామని వెల్లడి
దక్షిణాదిలో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అందాలభామ కీర్తి సురేశ్ దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూక్తిని అక్షరాలా పాటిస్తోంది. తాజాగా కాస్మెటిక్స్ వ్యాపారంలో ప్రవేశించింది. భూమిత్ర బ్రాండ్ పేరుతో చర్మసౌందర్య ఉత్పత్తులు తీసుకువస్తోంది. సోషల్ మీడియాలో అమ్మడు ఓ వీడియో రిలీజ్ చేసింది.

"వచ్చేసింది... నా బ్రాండ్ భూమిత్ర ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందని చెప్పడానికి ఎంతో ఉద్విగ్నంగా ఉంది. నా సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడంలేదు. ఎంతో సమర్థవంతం, విభిన్నం, స్వచ్ఛం, ప్రాకృతికం, సహజసిద్ధమైన పదార్థాలతో మా సౌందర్య ఉత్పత్తులు తయారయ్యాయి. మా ఉత్పత్తులు నూటికి నూరుశాతం పరిశుద్ధం, పర్యావరణ హితం" అని కీర్తి సురేశ్ తన పోస్టులో వివరించింది.
Keerthy Suresh
Skincare Products
Bhoomitra
Brand
Tollywood

More Telugu News